More

    దేశంలో మరోసారి విజృంభిస్తున్న కరోనా..!

    భారతదేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. నాలుగు నెలల గరిష్ఠ స్థాయికి కొత్త కేసులు చేరుకున్నాయి. గడచిన 24 గంటల్లో 17 వేల పైచిలుకు కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లో 17,336 మంది పాజిటివ్ గా తేలారు. ఫిబ్రవరి తర్వాత ఒక రోజులో 17 వేల పైచిలుకు కేసులు రావడం ఇదే తొలిసారి. రోజువారీ కేసుల్లో ఏకంగా 30 శాతం పెరుగుదల నమోదైంది. పాజిటివిటీ రేటు 4.32గా ఉంది. ఈ వారం మొత్తం పాజిటివిటీ రేటు 3.07గా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 88,284 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటిదాకా కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 4,33,62,294కు చేరుకుంది. గడచిన 24 గంటల్లో కరోనా వల్ల 13 మంది మరణించారు. భారత్ కరోనా మరణాల సంఖ్య 5,24,954కు చేరుకుంది. ఇప్పటిదాకా 196 కోట్ల పైచిలుకు వ్యాక్సిన్లు అందజేసినట్టు కేంద్రం వెల్లడించింది.

    spot_img

    Trending Stories

    Related Stories