దేశంలో కరోనా కేసుల అప్డేట్స్

0
714

దేశంలో గత 24 గంటల్లో 14,148 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 1,48,359 మంది చికిత్స పొందుతున్నార‌ని తెలిపింది. అదే సమయంలో 30,009 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,22,19,896కి చేరుకుంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.22 శాతంగా ఉంది.

తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 38,580 శాంపిల్స్ పరీక్షించగా, 348 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 93 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో 429 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒక్క మ‌ర‌ణం కూడా న‌మోదు కాలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,87,785 పాజిటివ్ కేసులు నమోదు కాగా 7,79,279 మంది కోలుకున్నారు కోలుకున్నారు. ఇంకా 4,396 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్ప‌టిదాకా మరణించిన వారి సంఖ్య 4,110గా ఉండ‌గా.. బుధ‌వారం ఒక్క మ‌ర‌ణం కూడా సంభ‌వించ‌లేదు.

ఏపీలో గడచిన 24 గంటల్లో 19,432 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 253 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 40 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 635 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,16,964 పాజిటివ్ కేసులు నమోదు కాగా 22,97,065 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 5,181 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,718కి పెరిగింది.