భారతదేశంలో కొత్తగా 16,326 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనాతో 666 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,73,728 మంది ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారు. గత 24 గంటల్లో 17,677 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో కరోనా నుండి కోలుకున్న వారి మొత్తం సంఖ్య మొత్తం 3,35,32,126కు చేరింది. మృతుల సంఖ్య మొత్తం 4,53,708కు పెరిగింది. గత 24 గంటల్లో 68,48,417 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. దీంతో ఇప్పటివరకు వేసిన మొత్తం వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,01,30,28,411 కు చేరింది.
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 42,367 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 193 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 64 కొత్త కేసులు నమోదు కాగా.. వికారాబాద్, నారాయణపేట, కొమరంభీం ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 196 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,69,932 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,62,025 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,963 మందికి చికిత్స జరుగుతోంది. కరోనా మృతుల సంఖ్య 3,944కి పెరిగింది.
ఏపీలో గడచిన 24 గంటల్లో 43,494 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. వారిలో 478 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 119 కొత్త కేసులు నమోదు కాగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 4 కేసులు గుర్తించారు. అదే సమయంలో 574 మంది కరోనా నుంచి కోలుకోగా, ఆరుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 20,62,781 పాజిటివ్ కేసులు నమోదు కాగా 20,43,050 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,398 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,333కి పెరిగింది.