దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు..!

0
928

భారతదేశంలో గత 24 గంటల్లో 25,072 కొత్త కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,24,49,306కు చేరింది. అదే సమయంలో క‌రోనా నుంచి 44,157 మంది కోలుకున్నారు. నిన్న 389 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మొత్తం 4,34,756కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,16,80,626 మంది కోలుకున్నారు. 3,33,924 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 58,25,49,595 డోసుల వ్యాక్సిన్లు వేసినట్టు అధికారులు ప్ర‌క‌టించారు.

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 46,987 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 231 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 66 కొత్త కేసులు నమోదయ్యాయి. వికారాబాద్, నాగర్ కర్నూల్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 453 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,54,989 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,44,747 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 6,384 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,858కి పెరిగింది.

22-08-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం గడచిన 24 గంటల్లో 57,745 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,085 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 137 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 1,541 మంది కరోనా నుంచి కోలుకోగా, 8 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,02,340 పాజిటివ్ కేసులు నమోదు కాగా 19,73,940 మంది పూర్తి ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 14,677 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 13,723కి పెరిగింది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

4 − 3 =