More

    దేశంలో లక్షన్నర దాటేసిన యాక్టివ్ కేసులు

    భారతదేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 21,411 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇదే సమయంలో 20,726 మంది మహమ్మారి నుంచి కోలుకోగా 67 మంది మృతి చెందారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,50,100 కి చేరుకుంది. ఇప్పటి వరకు 4,31,92,379 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 5,25,997 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 4.46 శాతంగా, క్రియాశీల రేటు 0.34 శాతంగా, రికవరీ రేటు 98.46 శాతంగా, మరణాల రేటు 1.20 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 2,01,68,14,771 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు.

    తెలంగాణలో గడచిన 24 గంటల్లో 32,808 శాంపిల్స్ పరీక్షించగా.. 739 మందికి పాజిటివ్ గా వెల్లడైంది. అత్యధికంగా హైదరాబాదులో 377 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 60, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 53, మంచిర్యాల జిల్లాలో 26, ఖమ్మం జిల్లాలో 24, పెద్దపల్లి జిల్లాలో 24 కేసులు గుర్తించారు. అదే సమయంలో 662 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణలో ఇప్పటివరకు 8,13,120 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 8,04,323 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,686 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 4,111 మంది కరోనాతో మృతి చెందారు.

    spot_img

    Trending Stories

    Related Stories