National

భారతదేశంలో మరింత పెరిగిన కరోనా కేసులు

భారతదేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో 13,313 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు రోజు 12,249 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 10,972 మంది కరోనా నుంచి కోలుకోగా, 38 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 83,990 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,33,44,958కి పెరిగింది. వీరిలో 4,27,36,027 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 5,24,941 మంది మృతి చెందారు. దేశంలో రికవరీ రేటు 98.60 శాతంగా, పాజిటివిటీ రేటు 2.03 శాతంగా, మరణాల రేటు 1.21 శాతంగా, క్రియాశీల రేటు 0.19 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 1,96,62,11,973 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు.

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 27,754 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 434 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. హైదరాబాదు జిల్లాలో అత్యధికంగా 292 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 71, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 28 కేసులు గుర్తించారు. అదే సమయంలో 129 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 7,97,138 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 7,90,347 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,680 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.

ఏపీ మాజీ మంత్రి, విశాఖ జిల్లా భీమిలి వైసీపీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ క‌రోనా బారిన ప‌డ్డారు. దీంతో ప్ర‌స్తుతం ఆయన త‌న ఇంటిలోనే ఐసోలేష‌న్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. అవంతి ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉందని వైద్యులు తెలిపారు.

Related Articles

Back to top button