భారతదేశంలో గత 24 గంటల్లో 50,848 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో 68,817 మంది బాధితులు కోలుకున్నారు. భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 82 రోజుల కనిష్ఠానికి చేరుకుంది. ప్రస్తుతం 6.43లక్షలకు యాక్టివ్ కేసులు చేరుకున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. 1,358 మంది వైరస్ బారినపడి ప్రాణాలు వదిలారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,00,28,709కు చేరింది. ఇప్పటి వరకు 2,89,94,855 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్ బారినపడి మొత్తం 3,90,660 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 6,43,194 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్యశాఖ వివరించింది.
ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో 74,453 కరోనా పరీక్షలు నిర్వహించగా 4,169 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 743 పాజిటివ్ కేసులు నమోదు కాగా, పశ్చిమ గోదావరి జిల్లాలో 659 మందికి కరోనా నిర్ధారణ అయింది. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 80 కరోనా కేసులు గుర్తించారు. అదే సమయంలో 8,376 మంది కొవిడ్ నుంచి కోలుకోగా, 53 మంది మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో మొత్తం 12,416 మంది కరోనాతో మృతి చెందారు. ఏపీలో ఇప్పటిదాకా 18,57,352 పాజిటివ్ కేసులు నమోదు కాగా 17,91,056 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 53,880 మందికి చికిత్స జరుగుతోంది.

22-06-2021న తెలంగాణ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం గడచిన 24 గంటల్లో 1,24,907 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,175 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. జీహెచ్ఎంసీ పరిధిలో 133 కొత్త కేసులు నమోదు కాగా, ఖమ్మం జిల్లాలో 76 కేసులు గుర్తించారు. అత్యల్పంగా కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో రాష్ట్రంలో 1,771 మంది కరోనా నుంచి కోలుకోగా, 10 మంది మృతి చెందారు. తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య 3,586కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,15,574 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 5,95,348 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 16,640 మంది చికిత్స పొందుతున్నారు.
