దేశంలో కరోనా కేసుల అప్డేట్స్

0
870

భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. దేశంలో కొత్తగా 15,102 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 4,28,67,031కి చేరింది. ఇందులో 4,21,89,887 మంది కరోనా నుంచి కోలుకోగా, 5,12,622 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,64,522 మంది బాధితులు చికిత్స తీసుకుంటున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో కొత్తగా 278 మంది మృతిచెందగా, 31,377 మంది కోలుకున్నారు. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 1.28 శాతంగా ఉంది. ఇప్పటివరకు 1,76,19,39,020 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశారు.

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 39,579 పరీక్షలు చేయగా.. 374 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 91 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో 683 కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,110కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,87,437 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,78,850 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,477 మంది చికిత్స పొందుతున్నారు.

ఏపీలో గడచిన 24 గంటల్లో 18,803 కరోనా పరీక్షలు నిర్వహించగా, 244 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 47 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 662 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,716కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,16,711 పాజిటివ్ కేసులు నమోదు కాగా 22,96,430 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 5,565 మంది చికిత్స పొందుతున్నారు.