భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. దేశంలో గత 24 గంటల్లో 7,83,567 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా 8,488 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 249 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 12,510 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కేరళలో గత 24 గంటల్లో 5,080 కేసులు నమోదు కాగా 40 మరణాలు సంభవించాయి. కేరళలో 7,908 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,18,443 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 534 రోజుల్లో ఇంత తక్కువ స్థాయిలో యాక్టివ్ కేసులు ఉండటం ఇదే తొలిసారి. గత ఏడాది ప్రారంభం నుంచి మొత్తం 3.45 కోట్ల మంది కరోనా బారిన పడగా, 3.39 కోట్ల మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 4,65,911 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 116 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 22,902 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 103 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 49 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో 153 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,74,555 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,66,999 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,575 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,981కి పెరిగింది.
ఏపీలో గడచిన 24 గంటల్లో 24,659 కరోనా పరీక్షలు నిర్వహించగా, 174 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 32 కొత్త కేసులు నమోదు కాగా, కర్నూలు జిల్లాలో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 301 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,71,244 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 20,54,553 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,265 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 14,426గా ఉంది.