భారతదేశంలో గత 24 గంటల్లో కొత్తగా 26,964 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,35,31,498కి చేరింది. ఇందులో 3,27,83,741 మంది కోలుకున్నారు. 4,45,768 మంది ఇప్పటి వరకూ కరోనా వల్ల మరణించారు. మరో 3,01,989 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. యాక్టివ్ కేసులు 186 రోజుల్లో 3 లక్షల 2 వేలకు దిగువకు చేరడం ఇదే మొదటిసారి. గత 24 గంటల్లో 34,167 మంది కోలుకున్నారని, 383 మంది కొత్తగా మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 82,65,15,754 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని ప్రభుత్వం తెలిపింది.
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 50,505 కరోనా పరీక్షలు నిర్వహించగా, 244 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 72 కేసులు వెల్లడయ్యాయి. నిర్మల్, నారాయణపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 296 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,63,906 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,55,061 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,938 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,907కి పెరిగింది.
21-09-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. ఏపీలో గడచిన 24 గంటల్లో 49,737 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,179 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 192 కొత్త కేసులు నమోదు కాగా, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో ఒక పాజిటివ్ కేసు నమోదైంది. అదే సమయంలో 1,651 మంది కరోనా నుంచి కోలుకోగా, 11 మంది మృత్యువాతపడ్డారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 14,089కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,40,708 పాజిటివ్ కేసులు నమోదు కాగా 20,12,714 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 13,905 మంది చికిత్స పొందుతున్నారు.