More

    దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

    భారతదేశంలో కొత్తగా 41,383 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,12,57,720కు చేరింది. అదే సమయంలో 38,652 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 507 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 4,18,987కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,04,29,339 మంది కోలుకున్నారు. 4,09,394 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 41,78,51,151 వ్యాక్సిన్ డోసులు వేశారు

    తెలంగాణలో గత 24 గంటల్లో 691 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. గత 24 గంటల్లో 1,14,260 మందికి కరోనా పరీక్షలను నిర్వహించామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్ఎంసీలో అత్యధికంగా 85 కేసులు నమోదవ్వగా.. కామారెడ్డి జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇదే సమయంలో 565 మంది కరోనా బాధితులు కోలుకోగా ఐదుగురు మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,38,721కి చేరుకుంది. ఇప్పటి వరకు 6,25,042 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం 3,771 మంది మృతి చెందారు.

    21-07-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం ఏపీలో కొత్తగా 2,527 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 515 కేసులు నమోదు కాగా, విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 43 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 2,412 మంది కోలుకోగా 19 మంది మృతి చెందారు. తాజా గణాంకాలతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 19,46,749 మంది కరోనా బారిన పడగా, వారిలో 19,09,613 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 13,197 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 23,939 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

    Trending Stories

    Related Stories