National

దేశంలో కరోనా కేసుల అప్డేట్స్

భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య గత 24 గంటల్లో 12,249 నమోదయ్యాయి. గత 24 గంటల్లో మరో 13 మంది కరోనాకు బలవగా, 9,862 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,33,31,645కు చేరాయి. ఇందులో 4,27,25,055 మంది బాధితులు కోలుకున్నారు. దేశంలో ఇప్పటిదాకా 5,24,903 మంది కరోనా రోగులు మృతిచెందారు. దేశంలో ప్రస్తుతం 81,687 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 3.94 శాతానికి చేరుకుందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 0.19 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.60 శాతం, మరణాల రేటు 1.21 శాతంగా ఉన్నదని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు 196.45 కోట్ల కరోనా టీకా డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది. కొత్తగా నమోదైన కేసుల్లో ఐదు రాష్ట్రాల్లోనే 74.5 శాతం ఉన్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 3659 (29.87 శాతం) కేసులు నమోదవగా, కేరళలో 2,609, ఢిల్లీలో 1,383, కర్ణాటకలో 738, తమిళనాడులో 737 చొప్పున కేసులు ఉన్నాయి.

తెలంగాణలో గత 24 గంటల్లో 26,704 కరోనా పరీక్షలు నిర్వహించగా, 403 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఒక్క హైదరాబాదులోనే 240 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 103, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 11 కేసులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 9 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 145 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 7,96,704 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 7,90,218 మంది కోలుకున్నారు. ఇంకా 2,375 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.

Related Articles

Back to top button