More

    దేశంలో కరోనా కేసుల అప్డేట్స్.. మరింత కనిష్ట స్థాయికి..!

    భార‌తదేశంలో క‌రోనా కేసులు మరింతగా తగ్గుతూ ఉన్నాయి. మూడు నెల‌ల త‌ర్వాత 43 వేల కంటే త‌క్కువ‌గా కరోనా కేసులు న‌మోద‌య్యాయి. భారతదేశంలో గత 24 గంటల్లో 42,640 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. అదే సమయంలో 81,839 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,99,77,861కు చేరింది. మరో 1,167 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,89,302కు పెరిగింది. ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,89,26,038 మంది కోలుకున్నారు. 6,62,521 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.

    21-06-2021న తెలంగాణ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,19,537 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,197 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధిక కేసులు వచ్చాయి. 137 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా నిర్మల్ జిల్లాలో 1 పాజిటివ్ కేసును గుర్తించారు. అదే సమయంలో 1,707 మంది కరోనా నుంచి కోలుకోగా, 9 మరణాలు సంభవించాయి. తాజా మరణాలతో కలిపి మొత్తం కరోనా మృతుల సంఖ్య 3,576కి పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 6,14,399 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 5,93,577 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 17,246 మంది చికిత్స పొందుతున్నారు.

    ఏపీలో గడచిన 24 గంటల్లో 55,002 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,620 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 531 కొత్త కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 88 కేసులు గుర్తించారు. అదే సమయంలో రాష్ట్రంలో 7,504 మంది కరోనా నుంచి కోలుకోగా, 44 మంది మరణించారు. ఒక్క చిత్తూరు జిల్లాలోనే 10 మంది మరణించారు. ఏపీలో ఇప్పటివరకు 18,53,183 పాజిటివ్ కేసులు నమోదు కాగా 17,82,680 మంది కోలుకున్నారు. ఇంకా 58,140 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 12,363కి చేరింది.

    Related Stories