దేశంలో గడచిన 24 గంటల సమయంలో కొత్తగా 2,57,299 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో 3,57,630 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,62,89,290కు చేరింది. మరో 4,194 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 2,95,525కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,30,70,365 మంది కోలుకున్నారు. 29,23,400 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 19,33,72,819 మందికి వ్యాక్సిన్లు వేశారు
21-05-2021న తెలంగాణ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. తెలంగాణలో గడచిన 24 గంటల్లో 65,997 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,464 మందికి కరోనా నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 534 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 243, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 219, ఖమ్మం జిల్లాలో 217 కేసులు గుర్తించారు. అదే సమయంలో 4,801 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. మరో 25 మంది మరణించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 5,47,727 పాజిటివ్ కేసులు నమోదు కాగా 5,00,247 మంది కోలుకున్నారు. ఇంకా 44,395 మందికి చికిత్స జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 92,231 కరోనా పరీక్షలు నిర్వహించగా 20,937 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 3,475 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 3,063 కేసులు గుర్తించారు. అదే సమయంలో 20,811 మంది కరోనా నుంచి కోలుకోగా, 104 మంది మరణించారు. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 9,904కి పెరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి దాకా 15,42,079 పాజిటివ్ కేసులు నమోదు కాగా 13,23,019 మంది కరోనా నుంచి బయటపడ్డారు. ఇంకా 2,09,156 మంది చికిత్స పొందుతున్నారు.