భారీగా తగ్గుతున్న కరోనా కేసులు

0
672

భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుతోంది. గత 24 గంటల్లో 5.68 లక్షల మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా… వీరిలో 1,581 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 2,741 మంది కరోనా నుంచి కోలుకోగా 33 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 23,913 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో రికవరీ రేటు 98.74 శాతానికి చేరుకుంది. భారతదేశంలో ఇప్పటి వరకు 4.30 కోట్ల మంది కరోనా బారిన పడగా… 4.24 కోట్ల మంది కోలుకున్నారు. మొత్తం 5.16 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 20,666 కరోనా పరీక్షలు నిర్వహించగా, 73 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాదులో 33 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 91 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,90,864 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,86,114 మంది ఆరోగ్యవంతులయ్యారు. ప్రస్తుతం 639 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.

ఏపీలో గడచిన 24 గంటల్లో 7,364 కరోనా పరీక్షలు నిర్వహించగా, 37 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గుంటూరు, కడప, కృష్ణా, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 42 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,19,267 పాజిటివ్ కేసులు నమోదు కాగా 23,04,031 మంది కోలుకున్నారు. ఇంకా 506 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా 14,730 మంది కరోనాతో మరణించారు.