భారతదేశంలో గత 24 గంటల్లో 3,37,704 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. గత 24గంటల్లో కరోనా వల్ల 488 మంది ప్రాణాలు కోల్పోయాని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా నుంచి 2,42,676 మంది కోలుకున్నారని వివరించింది. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 21,13,365 మందికి చికిత్స అందుతోందని తెలిపింది. డైలీ పాజిటివిటీ రేటు 17.22 శాతంగా ఉంది. ఇప్పటివరకు మొత్తం 10,050 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,20,243 పరీక్షలు చేయగా 4,416 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 1,670 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 1,920 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,26,819 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,93,623 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 29,127 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,069కి పెరిగింది.
ఏపీలో గడచిన 24 గంటల్లో 44,516 కరోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టగా 13,212 మందికి పాజిటివ్ గా తేలింది. విశాఖ జిల్లాలో అత్యధికంగా 2,244 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 2,942 మంది కరోనా నుంచి కోలుకోగా, ఐదుగురు మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 14,532కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 21,53,268 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 20,74,600 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఏపీలో ప్రస్తుతం 64,136 యాక్టివ్ కేసులు ఉన్నాయి.