More

    దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

    భారతదేశంలో గత 24 గంటల్లో 5,326 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో క‌రోనా నుంచి 8,043 మంది కోలుకున్నార‌ని పేర్కొంది. క‌రోనాతో గత 24 గంటల్లో 453 మంది ప్రాణాలు కోల్పోయారని వివ‌రించింది. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 79,097 మంది చికిత్స తీసుకుంటున్నారని పేర్కొంది. ఇక క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 3,41,95,060 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 4,78,007కు పెరిగింద‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 1,38,34,78,181 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 21,211 కరోనా శాంపిల్స్ పరీక్షించగా.. 75 కొత్త కేసులు నమోదయ్యాయి. విశాఖ జిల్లాలో అత్యధికంగా 17 కేసులు నమోదయ్యాయి, చిత్తూరు జిల్లాలో 13, గుంటూరు జిల్లాలో 10 కేసులు వెల్లడయ్యాయి. కర్నూలు, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 154 మంది కరోనా నుంచి కోలుకోగా, గుంటూరు జిల్లాలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,75,879 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 20,59,882 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 1,517 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 14,480కి చేరుకుంది.

    తెలంగాణలో గత 24 గంటల వ్యవధిలో 33,140 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 156 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 53 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో 207 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,79,720 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 6,72,063 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,642 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 4,015 మంది కరోనాతో మరణించారు.

    Trending Stories

    Related Stories