భారతదేశంలో గత 24గంటల్లో 2,119 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 44,638,636 చేరింది. అదే సమయంలో 2,582 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 25,037 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గత 24 గంటల్లో కరోనా కారణంగా 10 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 528,953 కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో 0.06 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయని, రికవరీ రేటు 98.76 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 219.50 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.
మహారాష్ట్రలో కొత్త, అత్యంత వేగంగా వ్యాప్తి చెందే వేరియంట్లు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటిదాకా వెలుగు చూసిన కరోనా వేరియంట్లలో ప్రమాదకర, వేగంగా వ్యాప్తి చెందేది ఎక్స్ఎక్స్ బీ (XXB) రకమని నిపుణులు భావిస్తున్నారు. ఎక్స్ ఎక్స్ బీ వేరియంట్ ఇప్పటిదాకా 17 దేశాలకు వ్యాపించింది. బీఏ 2.75, బీజే.1 సబ్-వేరియంట్ల కంటే దీని వృద్ధి ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. గత ఆరు నెలల్లో భారత దేశంలో దాదాపు 90 శాతం కొత్త ఇన్ఫెక్షన్లు బీఏ .2.75 వల్ల సంభవించాయని, ఎక్స్ ఎక్స్ బీ 7 శాతంగా ఉందని తేలింది. ఇది రోగనిరోధక వ్యవస్థను కూడా తప్పించుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.