దేశంలో కరోనా కేసుల అప్డేట్స్

దేశంలో కొత్తగా 26,115 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో కరోనా కేసుల మొత్తం సంఖ్య 3,35,04,534కి చేరింది. అదే సమయంలో 34,469 మంది కోలుకున్నారని పేర్కొంది. దేశంలో కరోనాతో మరో 252 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,45,385కి పెరిగింది. ఇక కరోనా నుంచి ఇప్పటివరకు 3,27,49,574 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 3,09,575 మందికి ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 81,85,13,827 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 45,274 కరోనా పరీక్షలు నిర్వహించగా, 208 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 49 కొత్త కేసులు నమోదు కాగా, వికారాబాద్, నారాయణపేట, కొమరంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 220 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,63,662 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,54,765 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 4,991 మందికి చికిత్స జరుగుతోంది. కరోనా మృతుల సంఖ్య 3,906కి పెరిగింది.
20-09-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం ఏపీలో గత 24 గంటల్లో 42,679 కరోనా పరీక్షలు నిర్వహించగా, 839 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 231 కొత్త కేసులు వెల్లడి కాగా, అనంతపురం జిల్లాలో 1 కేసు మాత్రమే గుర్తించారు. అదే సమయంలో 1,142 మంది కరోనా నుంచి కోలుకోగా, 8 మంది మృత్యువాతపడ్డారు. కరోనా మృతుల సంఖ్య 14,078కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,39,529 పాజిటివ్ కేసులు నమోదు కాగా 20,11,063 మంది కోలుకున్నారు. ఇంకా 14,388 మంది చికిత్స పొందుతున్నారు.