భారతదేశంలో కొత్తగా 11,539 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 4,43,39,429కి చేరాయి. ఇందులో 4,37,12,218 మంది బాధితులు కోలుకోగా, 5,27,332 మంది మరణించారు. 99,879 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 43 మంది మృతిచెందగా, 12,783 మంది కోలుకున్నారు. జూన్ 30 తర్వాత యాక్టివ్ కేసులు లక్ష దిగువకు చేరాయి. మొత్తం కేసుల్లో 0.23 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.59 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా 209.67 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీచేశామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 24,399 శాంపిల్స్ పరీక్షించగా, 357 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో 165, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 31, రంగారెడ్డి జిల్లాలో 32 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 440 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు నమోదవ్వలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 8,31,622 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… 8,24,800 మంది కోలుకున్నారు. ఇంకా 2,711 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటిదాకా రాష్ట్రంలో 4,111 మంది మృతి చెందారు.