దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

0
691

భారతదేశంలో గత 24 గంటల్లో 34,457 కొత్త కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. తాజా లెక్కల ప్రకారం దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,23,93,286కు చేరింది. అలాగే నిన్న క‌రోనా నుంచి 36,347 మంది కోలుకున్నారు. నిన్న 375 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మొత్తం 4,33,964కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,15,97,982 మంది కోలుకున్నారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 151 రోజుల క‌నిష్ఠ‌ స్థాయికి చేరుకుంది. 3,61,340 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 57,61,17,350 డోసుల వ్యాక్సిన్లు వేసినట్టు అధికారులు తెలిపారు.

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 73,899 కరోనా పరీక్షలు నిర్వహించగా 359 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాదు పరిధిలో 74 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆదిలాబాద్, కామారెడ్డి, నారాయణపేట, నిర్మల్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 494 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,54,394 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,43,812 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 6,728 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం కరోనా మృతుల సంఖ్య 3,854కి పెరిగింది.

20-08-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం గడచిన 24 గంటల్లో 69,173 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,435 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 199 కొత్త కేసులు నమోదు కాగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 19 కేసులను గుర్తించారు. అదే సమయంలో 1,695 మంది కోలుకోగా, రాష్ట్రవ్యాప్తంగా ఆరుగురు కరోనాతో మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 13,702కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,00,038 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 19,70,864 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 15,472 మంది చికిత్స పొందుతున్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here