National

దేశంలో కరోనా కేసుల అప్డేట్స్

భారతదేశంలో గత 24 గంటల్లో 42,015 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. తాజా గణాంకాల ప్రకారం దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,12,16,337కు చేరింది. అదే సమయంలో 36,977 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 3,998 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మృతుల సంఖ్య మొత్తం 4,18,480కు పెరిగింది. కరోనా నుంచి ఇప్పటివరకు 3,03,90,687 మంది కోలుకున్నారు. 4,07,170 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 41,54,72,455 వ్యాక్సిన్ డోసులు వేశారు.

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,04,478 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 657 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 74 కేసులు నమోదవ్వగా అత్యల్పంగా నారాయణ పేట్ జిల్లాలో 2, ఆదిలాబాద్ జిల్లాలో 2 కేసులు గుర్తించారు.అదే సమయంలో 704 మంది కోలుకోగా, ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,38,030 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,24,477 మంది కోలుకున్నారు. ఇంకా 9,787 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,766కి చేరింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 88,149 మందిని పరీక్షించగా 2,498 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 481 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 24 పాజిటివ్ కేసులు గుర్తించారు.అదే సమయంలో 2,201 మంది కరోనా నుండి కోలుకోగా, 24 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి 13,178 మంది కరోనా కారణంగా ప్రాణాలను కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 19,44,222 పాజిటివ్ కేసులు నమోదు కాగా 19,07,201 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 23,843 మంది చికిత్స పొందుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

4 × three =

Back to top button