More

    భారతదేశంలో కరోనా కేసుల అప్డేట్స్

    భారతదేశంలో గత 24 గంటల్లో కొత్తగా 1,549 మంది కరోనా బారినపడ్డారు. దీంతో భారతదేశంలో మొత్తం కేసులు 4,30,09,390కి చేరాయి. ఇందులో 4,24,67,774 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 5,16,510 మంది మృతిచెందగా, 25,106 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 31 మంది మరణించారని, 2652 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.

    తెలంగాణలో గడచిన 24 గంటల్లో 13,569 కరోనా పరీక్షలు నిర్వహించగా, 35 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా హైదరాబాదులో 21 కేసులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లాలో 5, హన్మకొండ జిల్లాలో 3, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 3, ఖమ్మం జిల్లాలో 1, సంగారెడ్డి జిల్లాలో 1, యాదాద్రి జిల్లాలో 1 కేసు నమోదు కాగా మిగిలిన జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 91 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడచిన 24 గంటల్లో కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 7,90,791 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,86,023 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 657 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 4,111 మంది కరోనాతో మరణించారు.

    ఏపీలో గడచిన 24 గంటల్లో 9,580 శాంపిల్స్ పరీక్షించగా, 49 కరోనా పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 19 కొత్త కేసులు నమోదయ్యాయి. కడప, కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 56 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో ఇప్పటివరకు 23,19,230 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 23,03,989 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 511 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా కరోనాతో 14,730 మంది మరణించారు.

    Trending Stories

    Related Stories