National

దేశంలో కరోనా కేసుల అప్డేట్స్

భారతదేశంలో కొత్తగా 30,256 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో క‌రోనా కేసుల మొత్తం సంఖ్య‌ 33,478,419 కి చేరింది. అదే సమయంలో 43,938 మంది కోలుకున్నార‌ని అధికారులు తెలిపారు. దేశంలో క‌రోనాతో మ‌రో 295 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,45,133కి పెరిగింది. క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 3,27,15,105 మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం 3,18,181 మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందుతోంది. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 80,85,68,144 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. కేర‌ళ‌లో కొత్త‌గా 19,653 క‌రోనా కేసులు న‌మోదుకాగా, 152 మంది మృతి చెందారు.

తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 35,160 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా, 173 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 64 కేసులు వెల్లడయ్యాయి. వనపర్తి, నిర్మల్, నారాయణపేట, నాగర్ కర్నూల్, ములుగు, కొమరంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 315 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,63,454 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,54,545 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 5,005 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మరణాల సంఖ్య 3,904కి పెరిగింది.

19-09-2021న అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 68,568 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,337 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 231 కొత్త కేసులు నమోదు కాగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 1,282 మంది కరోనా నుంచి కోలుకోగా, 9 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,38,690 పాజిటివ్ కేసులు నమోదు కాగా 20,09,921 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఏపీలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 14,699గా ఉంది. కరోనా మృతుల సంఖ్య 14,070కి పెరిగింది.

Related Articles

Back to top button