More

    దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

    భారతదేశంలో గత 24 గంటల్లో 3.15 లక్షల మందికి వైద్య పరీక్షలను నిర్వహించగా 13,272 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 13,900 మంది కరోనా నుంచి కోలుకోగా 36 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 1,01,166 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో మహారాష్ట్రలో 2,285 కేసులు, కర్ణాటకలో 1,573 కేసులు, ఢిల్లీలో 1,417 కేసులు, కేరళలో 1,093 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో పాజిటివిటీ రేటు 4.21 శాతంగా, క్రియాశీల రేటు 1.01 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 4.43 కోట్ల మందికి కరోనా సోకగా.. వీరిలో 98.58 శాతం మంది కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 209 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేశారు.

    spot_img

    Trending Stories

    Related Stories