దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

0
820

భారతదేశంలో గత 24 గంటల్లో 30,093 కరోనా కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో 45,254 మంది కరోనా నుంచి కోలుకోగా 374 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 3,11,74,322 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ 3,03,53,710 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో 4,14,482 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 4,06,130 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 41,18,46,401 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.

19-07-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 71,152 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,628 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 291 కేసులు నమోదవ్వగా.. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 25 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే సమయంలో 2,744 మంది కరోనా నుంచి కోలుకోగా, 22 మంది మరణించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో ఐదుగురు మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి మొత్తం కరోనా మృతుల సంఖ్య 13,154కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,41,724 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 19,05,000 మంది ఆరోగ్యవంతులయ్యారు. 23,570 మంది చికిత్స పొందుతున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 1,20,165 కరోనా పరీక్షలు నిర్వహించగా, 746 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 71 కేసులు నమోదవ్వగా.. అత్యల్పంగా నారాయణపేట జిల్లాలో ఒక పాజిటివ్ కేసును గుర్తించారు. అదే సమయంలో 729 మంది కరోనా నుంచి కోలుకోగా, ఐదుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,37,373 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,23,773 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 9,836 మందికి చికిత్స జరుగుతోంది. దేశంలో కరోనా మృతుల సంఖ్య 3,764కి చేరింది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here