దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

0
764

భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉన్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆదివారం 2,96,500 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా, కొత్తగా 12,781 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో మహారాష్ట్రలో అత్యధికంగా 4,004, ఢిల్లీలో 1,530, కేరళ రాష్ట్రంలో 2,786 కేసులు నమోదయ్యాయి. రోజువారి పాజిటివిటీ రేటు 4.32శాతంకు పెరిగింది. గత 24గంటల్లో కరోనాతో చికిత్స పొందుతూ 18 మంది మృతిచెందారు. దేశంలో కరోనాతో కారణంగా ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 5,24,873కు చేరింది. 8,537 మంది కరోనాతో చికిత్స పొందుతూ కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 76,700గా ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకూ 196.18 కోట్ల టీకాలు వేశారు.

తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 19,715 శాంపిల్స్ పరీక్షించగా, 236 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. హైదరాబాదు జిల్లాలో అత్యధికంగా 180 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 28, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 13 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 122 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ నమోదు కాలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 7,96,055 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 7,89,918 మంది ఆరోగ్యవంతులయ్యారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.