భారతదేశంలో కరోనా కేసుల అప్డేట్స్.. హైదరాబాద్‌లో వెలుగు చూసిన ‘ఒమిక్రాన్ బీఏ.4’

0
701

భారతదేశంలో గత 24 గంటల్లో కొత్తగా 2,259 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 2,641 మంది కరోనా నుంచి కోలుకోగా 20 మంది మరణించారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 4,31,29,563కి చేరుకుంది. ఇప్పటి వరకు 4,25,92,455 మంది కరోనా నుంచి కోలుకోగా… 5,24,323 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 15,044 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 0.50 శాతంగా, రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 1,91,96,32,518 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు.

ఇక వివిధ దేశాల్లో కరోనా కేసులు పెరగడానికి కారణమైన ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అయిన ‘బీఎ.4’ తాజాగా హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. అందుకు సంబంధించి ఈ నెల 9వ తేదీన ఈ కేసు నమోదైంది. ఈ వేరియంట్‌తో కేసు నమోదు కావడం దేశంలోనే ఇది తొలిసారి. ఇది మరిన్ని నగరాలకు కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) పేర్కొంది. కరోనా బారినపడిన వారికి, ఇప్పటికే టీకా రెండు డోసులు తీసుకున్న వారికి కూడా ఇది సోకుతున్నట్టు ఇప్పటికే నిర్ధారణ అయింది. ఒమిక్రాన్ వేరియంట్ అంత ప్రమాదకారి కాదు కానీ, వ్యాప్తి మాత్రం అధికంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.