National

భారతదేశంలో కరోనా కేసుల అప్డేట్స్

భార‌తదేశంలో గడచిన 24 గంట‌ల సమయంలో కొత్త‌గా 2,76,070 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో 3,69,077 మంది కోలుకున్నారు. భారతదేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,57,72,400కు చేరింది. మరో 3,874 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారతదేశంలో మృతుల సంఖ్య మొత్తం 2,87,122 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,23,55,440 మంది కోలుకున్నారు. 31,29,878 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 18,70,09,792 మందికి వ్యాక్సిన్లు వేశారు. దేశంలో నిన్నటి వరకు మొత్తం 32,23,56,187 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.

కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా కరోనాతో కన్నుమూశారు. ఆయన వయసు 89 సంవత్సరాలు. హర్యానా, బీహార్‌కు గవర్నర్‌గా కూడా పనిచేశారు. పహాడియా 1980-81 మధ్య రాజస్థాన్‌కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. పహాడియా మరణవార్త విని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మృతికి సంతాపంగా రాష్ట్ర ప్రభుత్వం సంతాపదినంగా ప్రకటించింది. పహాడియా మృతికి సంతాపం తెలిపేందుకు రాజస్థాన్ కేబినెట్ సమావేశం కానుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

twelve + seven =

Back to top button