తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల అప్డేట్స్

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.. గడచిన 24 గంటల్లో అన్ని జిల్లాల్లో కలిపి 1,01,281 కరోనా పరీక్షలు నిర్వహించగా 22,610 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో 3,602 కేసులు, చిత్తూరు జిల్లాలో 3,185 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 23,098 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో ఒక్కరోజు వ్యవధిలో కరోనా ప్రభావానికి 114 మంది మృత్యువాత పడ్డారు. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 17 మంది, చిత్తూరు జిల్లాలో 15 మంది మరణించారు. ఈ నేపథ్యంలో, రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 9,800కి చేరింది. ఏపీలో ఇప్పటివరకు 15,21,142 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 13,02,208 మంది పూర్తిగా కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,09,134 మంది చికిత్స పొందుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 69,252 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,660 కొత్త కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 574 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అదే సమయంలో 4,826 మంది కరోనా నుంచి కోలుకోగా, 23 మంది మరణించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 5,44,263 పాజిటివ్ కేసులు నమోదు కాగా 4,95,446 మంది కోలుకున్నారు. ఇంకా 45,757 మందికి ఐసోలేషన్ లోనూ, ఆసుపత్రుల్లోనూ చికిత్స కొనసాగుతోంది. మొత్తం మరణాల సంఖ్య 3,060కి చేరింది.
జిల్లాల వారీగా చూసుకుంటే ఆదిలాబాద్-16, భద్రాద్రి కొత్తగూడెం-121, జీహెచ్ఎంసీ-574, జగిత్యాల-93, జనగాం-38, జయశంకర్ భూపాలపల్లి-45, జోగులాంబ గద్వాల-55, కామారెడ్డి-31, కరీంనగర్-147, ఖమ్మం-217, కొమురంభీం ఆసిఫాబాద్-23, మహబూబ్‌నగర్-128, మహబూబాబాద్-72, మంచిర్యాల-108, మెదక్-47, మేడ్చల్ మల్కాజ్గిరి-218, ములుగు-51, నాగర్‌కర్నూలు-118, నల్లగొండ-166, నారాయణపేట-33, నిర్మల్-18, నిజామాబాద్-59, పెద్దపల్లి-120, రాజన్న సిరిసిల్ల-66, రంగారెడ్డి-247, సంగారెడ్డి-106, సిద్దిపేట-116, సూర్యాపేట-110, వికారాబాద్-112, వనపర్తి-80, వరంగల్ రూరల్-103, వరంగల్ అర్బన్-131, యాదాద్రి భువనగిరి-91 కేసులు నమోదయ్యాయి.