దేశంలో కరోనా కేసుల అప్డేట్స్

0
871

భారతదేశంలో కొత్త‌గా 3,17,532 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో భారతదేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,82,18,773కు చేరింది. 19,24,051 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి, 3,58,07,029 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 491 మంది మ‌ర‌ణించ‌గా, 2,23,990 మంది క‌రోనా నుంచి కోలుకున్నార‌ని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 16.41 శాతానికి పెరిగింద‌ని అధికారులు తెలిపారు. ఇక దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 9287కు చేరాయి.

తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 3,557 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1474 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 1,773 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురు మృతి చెందారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 7,18,196 కాగా వీరిలో 6,89,878 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 4,065 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 24,253 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో 41,713 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా… 10,057 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. విశాఖ జిల్లాలో అత్యధికంగా 1,827 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 1,222 మంది కరోనా నుంచి కోలుకోగా… 8 మంది మృతి చెందారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 21,27,441కి చేరుకుంది. వీరిలో 20,67,984 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 14,522 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 44,935 యాక్టివ్ కేసులు ఉన్నాయి.