దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

0
651

భారతదేశంలో గత 24 గంటల్లో కొత్త‌గా 13,058 క‌రోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. కొత్త కేసులు 231 రోజుల క‌నిష్ఠ స్థాయిలో న‌మోద‌య్యాయ‌ని వివ‌రించింది. అదే సమయంలో 19,470 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో క‌రోనాతో 164 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,52,454కు చేరింది. మొత్తం కేసుల సంఖ్య‌ 3,40,94,373కు పెరిగింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 227 రోజుల క‌నిష్ఠానికి చేరింది. ప్ర‌స్తుతం 1,83,118 మంది ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స పొందుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 3,34,58,801 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. దేశంలో మొత్తం 98,67,69,411 వ్యాక్సిన్ డోసులు వినియోగించారు. కేర‌ళ‌లో గత 24 గంటల్లో 6,676 కేసులు న‌మోద‌య్యాయి. అదే సమయంలో 60 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు.

18-10-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం ఏపీలో గడచిన 24 గంటల్లో 30,219 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 332 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 74 కొత్త కేసులు నమోదు కాగా,విజయనగరం జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 651 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఆరుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 20,60,804 పాజిటివ్ కేసులు నమోదు కాగా 20,40,782 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,709 మందికి చికిత్స కొనసాగుతోంది. కరోనా మృతుల సంఖ్య 14,313కి పెరిగింది.

తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 45,418 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 208 మందికి పాజిటివ్ గా వెల్లడైంది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాదులో 62 కొత్త కేసులు నమోదయ్యాయి. వికారాబాద్, నిర్మల్, నారాయణపేట, కొమరంభీం ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 201 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,69,163 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,61,294 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 3,929 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,940కి పెరిగింది.