భారత దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 15,754 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వరుసగా రెండు రోజుల్లో దాదాపు మూడు వేలకు పైగా కేసులు పెరిగాయి. కరోనా వైరస్ కారణంగా తాజాగా మరో 39 మంది మృతి చెందారని ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా వల్ల దేశంలో ఇప్పటిదాకా చనిపోయిన వారి సంఖ్య 5,27,253కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 1,01,830 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటిదాకా నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,43,14,618కి చేరుకుంది. గత 24 గంటల్లో 15,220 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దాంతో, ఇప్పటిదాకా కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 4,36,85,535కి చేరుకుంది. క్రియాశీల రేటు 0.23 శాతంగా ఉండగా రికవరీ రేటు 98.58 శాతంగా ఉంది. రోజువారీ పాటిజివిటీ రేటు 3.47 శాతంగా ఉంది. దేశ వ్యాప్తంగా ఇప్పటిదాకా 209.27 కోట్ల కరోనా వ్యాక్సిన్లు అందజేసినట్టు కేంద్రం తెలిపింది.
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 29,590 శాంపిల్స్ పరీక్షించగా, 435 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో 199, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 35, రంగారెడ్డి జిల్లాలో 29 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 612 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 8,30,815 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,23,884 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,820 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటిదాకా రాష్ట్రంలో 4,111 మంది మృతి చెందారు.