దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

0
740

దేశంలో గత 24 గంటల్లో 36,401 కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది.భారతదేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,23,22,258కు చేరింది. అలాగే నిన్న క‌రోనా నుంచి 39,157 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 530 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,33,049కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,15,25,080 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 149 రోజుల క‌నిష్ఠ‌స్థాయికి చేరుకుంది. 3,64,129 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశంలో నిన్న 56,36,336 వ్యాక్సిన్ డోసులు వేశారు.

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 91,350 కరోనా పరీక్షలు నిర్వహించగా 424 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 73 కొత్త కేసులు నమోదు కాగా జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 449 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,53,626 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,42,865 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 6,912 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,849కి చేరింది.

18-08-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో 68,041 మందికి కరోనా పరీక్షలను నిర్వహించగా 1,433 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధికంగా 216 కేసులు నమోదు కాగా కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 16 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది మృత్యువాత మరణించారు. 1,815 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 19,97,102కి చేరుకుంది. మొత్తం 19,67,472 మంది కోలుకున్నారు. 13,686 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 15,944 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

16 − one =