More

    దేశంలో కరోనా కేసుల అప్డేట్స్.. వ్యాక్సినేషన్ లో మరో మైలు రాయి అందుకున్న భారత్

    భారతదేశంలో గత 24 గంటల్లో 38,164 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. భారతదేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,11,44,229కు చేరింది. అదే సమయంలో 38,660 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 499 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంలో మృతుల సంఖ్య మొత్తం 4,14,108కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,03,08,456 మంది కోలుకున్నారు. 4,21,665 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 40,64,81,493 వ్యాక్సిన్ డోసులు వేశారు.

    దేశవ్యాప్తంగా 40 కోట్ల మందికిపైగా కరోనా టీకాలను పంపిణీ చేశామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. శనివారం ఒక్కరోజే 46.38 లక్షల మందికి వ్యాక్సినేషన్ జరిగింది. శనివారం రోజు 21,18,682 మంది 18 నుంచి 44 ఏండ్ల మధ్య వయసున్న వాళ్లకు మొదటి డోసు, 2,33,019 మందికి రెండో డోసు పంపిణీ చేసింది ప్రభుత్వం. ఆదివారం నాటికి దేశంలో ఇప్పటివరకు 40,64,81,493 మందికి వ్యాక్సినేషన్‌ చేశామని వెల్లడించింది. ఇప్పటివరకూ దేశ జనాభాలో కేవలం దాదాపు ఆరు శాతం మంది ప్రజలకే రెండు డోసుల వ్యాక్సిన్ లభించింది. దేశంలో ప్రస్తుతం రోజుకు సగటున 40 లక్షల మందికి టీకాలు వేస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి 70 శాతం మంది ప్రజలకు టీకా వేయాలన్న లక్ష్యాన్ని అందుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఒక డోసు వేసుకున్న వారు జనాభాలో 17 శాతం మంది వరకు ఉన్నారు. ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య 135 కోట్ల డోసులు అందుబాటులో ఉంటాయని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పింది.

    తెలంగాణలో గడచిన 24 గంటల్లో 90,966 కరోనా పరీక్షలు నిర్వహించగా, 578 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 75 కేసులు నమోదయ్యాయి. కొమరంభీమ్ ఆసిఫాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 731 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,36,627 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,23,044 మంది ఆరోగ్యవంతులయ్యారు. 9,824 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,759కి పెరిగింది.

    18-07-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. ఏపీలో గడచిన 24 గంటల్లో 1,05,024 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,974 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 577 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 33 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 3,290 మంది కరోనా నుంచి కోలుకోగా, 17 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,40,096 పాజిటివ్ కేసులు నమోదు కాగా 19,02,256 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 24,708 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 13,132కి పెరిగింది.

    Trending Stories

    Related Stories