National

భారత్ లో కరోనా కేసుల అప్డేట్స్..!

భారతదేశంలో గత 24గంటల్లో 60,753 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. అదే సమయంలో 97,743 మంది కోలుకున్నారు. దీంతో భారతదేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,98,23,546కు చేరింది. మరో 1,647 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,85,137 కు పెరిగింది. భారతదేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,86,78,390 మంది కోలుకున్నారు. 7,60,019 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 27,23,88,783 మందికి వ్యాక్సిన్లు ఇచ్చారు.

18-06-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం రాష్ట్రంలో గత 24 గంటల్లో 6,341 మంది కరోనా బారిన పడ్డారు. ఇదే సమయంలో 57 మంది ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్నూలు, విజయనగరం జిల్లాల్లో అత్యల్పంగా ఇద్దరు చొప్పున చనిపోయారు. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 8,486 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 67,629 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 12,224 మంది మృతి చెందారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 18,39,243 మంది కరోనా బారిన పడగా 17,59,390 మంది కోలుకున్నారు.

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,24,430 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,417 కొత్త కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 149, రంగారెడ్డి జిల్లాలో 104, ఖమ్మం జిల్లాలో 93 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా నిర్మల్ జిల్లాలో రెండు కేసులు గుర్తించారు. అదే సమయంలో 1,897 మంది కరోనా నుంచి కోలుకోగా, 12 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో మొత్తం 3,546 మంది కరోనాతో కన్నుమూశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,10,834 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 5,88,259 మంది ఆరోగ్యవంతులయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 19,029 చికిత్స పొందుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

one × four =

Back to top button