Telugu States

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల అప్డేట్స్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 1,01,330 కరోనా పరీక్షలు నిర్వహించగా 23,160 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తూర్పుగోదావరిలో అత్యధికంగా 3,528 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 2,670 కేసులు, అనంతపురం జిల్లాలో 2,334 కేసులు, విశాఖ జిల్లాలో 2,007 కేసులు గుర్తించారు. విజయనగరం జిల్లా 945 మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ 1000కి పైన పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 106 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే 17 మంది కరోనాకు బలయ్యారు. నెల్లూరు, విశాఖ జిల్లాల్లో 11 మంది చొప్పున మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 9,686కి చేరింది. అదే సమయంలో 24,819 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు అయ్యారని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ తెలిపింది. ఏపీలో ఇప్పటివరకు 14,98,532 పాజిటివ్ కేసులు నమోదు కాగా 12,79,110 మంది కోలుకున్నారు. ఇంకా 2,09,736 మంది చికిత్స పొందుతున్నారు.

ఏపీ ప్రభుత్వం బ్లాక్ ఫంగస్ కేసులను ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా నుంచి కోలుకున్న వారికి వచ్చే బ్లాక్ ఫంగస్ కు కూడా చికిత్స చేయాలని ఆదేశించారు. బ్లాక్ ఫంగస్ చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వం నిర్ణయించింది. బ్లాక్ ఫంగస్ చికిత్సపై వెంటనే చర్యలు ప్రారంభించాలని ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోను ఆదేశించింది.

తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 71,070 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,837 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 594 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 17 కేసులు గుర్తించారు. అదే సమయంలో 4,976 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు అయ్యారు. 25 మంది మరణించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 5,40,603 పాజిటివ్ కేసులు నమోదు కాగా 4,90,620 మంది కోలుకున్నారు. ఇంకా 46,946 మందికి కరోనా చికిత్స జరుగుతోంది. మొత్తం మరణాల సంఖ్య 3,037కి చేరింది.

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుప‌త్రిని ఈరోజు సందర్శించారు. ఆయనతో పాటు మంత్రి హ‌రీశ్ రావు, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్, ప‌లువురు అధికారులు ఆసుపత్రిలో రోగులను పరామర్శించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

nine − 5 =

Back to top button