భారతదేశంలో గత 24 గంటల్లో కేవలం 2,075 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇదే సమయంలో 3,383 మంది కోలుకోగా, 71 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 27,802గా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.56కి పడిపోయింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 4,24,61,926 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం 5,16,352 మంది మృతి చెందారు.
ఏపీలో గత 24 గంటల్లో 75 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 46 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదు. అనంతపురం జిల్లాలో అత్యధికంగా 23 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 23,19,141కి చేరుకుంది. వీరిలో 23,03,875 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 14,730 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 536 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 16,241 కరోనా పరీక్షలు నిర్వహించగా, 52 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాదులో కొత్తగా 25 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 91 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనాతో మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 7,90,689 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,85,840 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 738 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.