దేశంలో కరోనా కేసుల అప్డేట్స్

0
696

భారతదేశంలో కొత్త‌గా 22,279 మందికి క‌రోనా వైర‌స్ వ్యాపించింది. అదే సమయంలో 60,298 మంది క‌రోనా నుంచి కోలుకున్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ తెలిపింది. 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 325 మంది మ‌ర‌ణించిన‌ట్లు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. దేశ‌వ్యాప్తంగా 2,53,739 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 1.8 శాతంగా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో క‌రోనా వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య 5,11,230కి చేరుకుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 22,383 శాంపిల్స్ పరీక్షించగా, 495 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 106 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో 1,543 మంది కరోనా నుంచి కోలుకోగా, చిత్తూరు జిల్లాలో ఒకరు మరణించారు. ఇప్పటి వరకూ కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,708కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,15,525 మంది కరోనా బారినపడగా, వారిలో 22,92,396 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 8,421 మంది చికిత్స పొందుతున్నారు.

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 41,042 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 425 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాదులో 130 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 1,060 మంది కరోనా నుంచి కోలుకోగా, ఎలాంటి మరణాలు సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,86,021 మంది కరోనా బారినపడగా, వారిలో 7,75,802 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 6,111 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,108కి పెరిగింది.