More

    దేశంలో కరోనా కేసుల అప్డేట్స్ ..!

    భారత దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 35,662 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,34,17,390కి చేరింది. ఇప్పటివరకు 3,26,32,222 మంది కరోనా నుంచి కోలుకున్నారు. శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 33,798 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.ఇందులో 3,40,639 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. శుక్రవారం దేశవ్యాప్తంగా 2.5 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ చేశారు. దీంతో ఇప్పటివరకు చైనా పేరుతో ఉన్న ఒక్కరోజులో అత్యధిక టీకాలు పంపిణీ చేసిన రికార్డును భారత్‌ తుడిపివేసింది. దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ 17 వరకు 55,07,80,273 నమూనాలకు పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్‌) తెలిపింది.

    తెలంగాణలో గడచిన 24 గంటల్లో 52,943 కరోనా పరీక్షలు నిర్వహించగా, 241 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 68 కొత్త కేసులు నమోదయ్యాయి. నారాయణపేట, కొమరంభీం ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 298 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,63,026 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,53,901 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,223 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,902కి పెరిగింది.

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 60,350 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 1,393 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 272 కొత్త కేసులు నమోదు కాగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 5 కేసులు గుర్తించారు. అదే సమయంలో 1,296 మంది కరోనా నుంచి కోలుకోగా, 8 మంది మరణించారు. కరోనా మృతుల సంఖ్య 14,052కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,36,179 పాజిటివ్ కేసులు నమోదు కాగా 20,07,330 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 14,797 మంది చికిత్స పొందుతున్నారు.

    Trending Stories

    Related Stories