National

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 62,480 మందికి క‌రోనా

భారతదేశంలో గత 24 గంటల్లో 62,480 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. అదే సమయంలో 88,977 మంది కోలుకున్నారు. భారతదేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,97,62,793కు చేరింది. 1,587 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. భారత్ లో కరోనా మృతుల సంఖ్య మొత్తం 3,83,490కు పెరిగింది. ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,85,80,647 మంది కోలుకున్నారు. 7,98,656 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 26,89,60,399 మందికి వ్యాక్సిన్లు వేశారు.

17-06-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం గడచిన 24 గంటల్లో 1,02,712 కరోనా పరీక్షలు నిర్వహించగా 6,151 మందికి పాజిటివ్ గా వెల్లడైంది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1,244 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 937 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 199 కేసులు గుర్తించారు. అదే సమయంలో 7,728 మంది కరోనా నుంచి కోలుకోగా, 58 మంది మరణించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 18,32,902 పాజిటివ్ కేసులు నమోదు కాగా 17,50,904 మందికి కరోనా నయమైంది. ఇంకా 69,831 మందికి చికిత్స జరుగుతోంది. కరోనా మృతుల సంఖ్య 12,167కి చేరింది.

తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,19,464 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,492 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 166 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. ఖమ్మం జిల్లాలో 129, నల్గొండ జిల్లాలో 115 కొత్త కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో 1 కేసు నమోదైంది. అదే సమయంలో 1,933 మంది కరోనా నుంచి కోలుకోగా, 13 మంది మరణించారు. తెలంగాణలో ఇప్పటివరకు 3,534 మంది కరోనాతో కన్నుమూశారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,09,417 పాజిటివ్ కేసులు నమోదు కాగా 5,86,362 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 19,521 మందికి చికిత్స జరుగుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

four + six =

Back to top button