More

    దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

    భారతదేశంలో గత 24 గంటల్లో 2,528 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 3,997 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో కరోనా కారణంగా 149 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 29,181కి చేరాయి. పాజిటివిటీ రేటు 0.40 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 4,24,58,543 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 5,16,281కి చేరింది. రికవరీ రేటు 98.73 శాతంగా ఉంది.

    ఏపీలో గడచిన 24 గంటల్లో 11,594 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 54 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 22 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 57 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. ఏపీలో ఇప్పటివరకు 23,19,066 పాజిటివ్ కేసులు నమోదు కాగా 23,03,829 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 507 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 14,730 మంది మరణించారు.

    తెలంగాణలో గడచిన 24 గంటల్లో 22,400 కరోనా పరీక్షలు నిర్వహించగా, 63 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాద్ పరిధిలో 30 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 102 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణలో ఇప్పటిదాకా 7,90,637 కరోనా కేసులు నమోదు కాగా… 7,85,749 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 777 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనాతో ఇప్పటి వరకు 4,111 మంది మరణించారు.

    Trending Stories

    Related Stories