భారత దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

0
709

భారతదేశంలో కొత్త‌గా 7,447 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్లలో క‌రోనాకు 86,415 మంది చికిత్స తీసుకుంటున్నారు. గత 24 గంటల్లో క‌రోనా నుంచి 7,886 మంది కోలుకున్నారు. అదే సమయంలో 391 మంది వైర‌స్ వ‌ల్ల ప్రాణాలు కోల్పోయారు. ఇప్ప‌టివ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,41,62,765కు చేరుకుంది. మ‌ర‌ణాల సంఖ్య మొత్తం 4,76,869కు చేరింది. దేశంలో మొత్తం వినియోగించిన‌ వ్యాక్సిన్ డోసుల సంఖ్య‌ 1,35,99,96,267కు పెరిగింది.

తెలంగాణలో కొత్తగా నలుగురికి ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కొత్త కేసులతో కలిపి తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 7కి పెరిగింది. ఇప్పటివరకు మహారాష్ట్రలో 32, రాజస్థాన్ లో 17, ఢిల్లీలో 10, కర్ణాటకలో 8, తెలంగాణలో 7, కేరళలో 5, గుజరాత్ లో 5 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో 1, చత్తీస్ గఢ్ లో 1, తమిళనాడులో 1 ఒమిక్రాన్ కేసును గుర్తించారు. దేశంలో కొత్త వేరియంట్ కారణంగా నమోదైన కేసుల సంఖ్య 87కి చేరింది.

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 40,103 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 190 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 80 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో 195 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,79,064 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 6,71,247 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 3,805 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,012కి పెరిగింది.

ఏపీలో గత 24 గంటల్లో 33,043 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా 148 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 34 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో గుంటూరు, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. అదే సమయంలో 152 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,75,419కి చేరుకుంది. ఇప్పటి వరకు 20,59,131 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. కరోనా బారిన పడి ఇప్పటి వరకు మొత్తం 14,474 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,814 యాక్టివ్ కేసులు ఉన్నాయి.