భారతదేశంలో గత 24 గంటల్లో కొత్తగా 34,403 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 3,33,81,728కి చేరింది. అదే సమయంలో 37,950 మంది కోలుకున్నారని అధికారులు తెలిపారు. దేశంలో కరోనాతో మరో 320 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,44,248 కి పెరిగింది. ఇక కరోనా నుంచి ఇప్పటివరకు 3,25,98,424మంది కోలుకున్నారు. ప్రస్తుతం 3,39,056 మందికి ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. నిన్న దేశంలో 67,43,775 వ్యాక్సిన్ డోసులను ప్రజలకు వేశారు. దేశంలో ఇప్పటివరకు మొత్తం 77.24 కోట్ల డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 58,261 కొవిడ్ టెస్టులు నిర్వహించగా, 259 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాదులో అత్యధికంగా 72 కొత్త కేసులు నమోదయ్యాయి. వికారాబాద్, ములుగు, జోగులాంబ గద్వాల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 301 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. కరోనా మృతుల సంఖ్య 3,900కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,62,785 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,53,603 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,282 మంది చికిత్స పొందుతున్నారు.
16-09-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. ఏపీలో గడచిన 24 గంటల్లో 61,178 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,367 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 288 కొత్త కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 3 కేసులు గుర్తించారు. అదే సమయంలో 1,248 మంది కరోనా నుంచి కోలుకోగా, 14 మంది మృత్యువాతపడ్డారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 14,044కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,34,786 పాజిటివ్ కేసులు నమోదు కాగా 20,06,034 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 14,708 యాక్టివ్ కేసులు ఉన్నాయి.