భారతదేశంలో గత 24గంటల్లో 25,166 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇంత తక్కువగా కొత్త కేసులు నమోదు కావడం 154 రోజుల్లో ఇదే తొలిసారి. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,22,50,679కు చేరింది. గత 24 గంటల్లో కరోనా నుంచి 36,830 మంది కోలుకున్నారు. అదే సమయంలో 437 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,32,079కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,14,48,754 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 146 రోజుల కనిష్ఠ స్థాయికి చేరుకుంది. 3,69,846 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 84,262 కరోనా పరీక్షలు నిర్వహించగా 405 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 67 కొత్త కేసులు నమోదు కాగా, నిర్మల్ జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 577 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. కరోనా మృతుల సంఖ్య 3,845కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,52,785 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,41,847 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 7,093 మంది చికిత్స పొందుతున్నారు.

16-08-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం గత 24 గంటల్లో 46,962 మంది శాంపిల్స్ పరీక్షించగా 909 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 241 కేసులు నమోదు కాగా.. అనంతపురం జిల్లాలో అత్యల్పంగా 5 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 1,543 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 మంది మరణించారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో 19,94,606 కేసులు నమోదు కాగా 19,63,728 మంది కోలుకున్నారు. మొత్తం 13,660 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17,218 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
