National

దేశంలో కరోనా కేసుల అప్డేట్స్

భారతదేశంలో గత 24 గంటల్లో 38,079 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,10,64,908కు చేరింది. అదే సమయంలో 560 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంలో మృతుల సంఖ్య మొత్తం 4,13,091కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,01,83,876 మంది కోలుకున్నారు. 4,24,025 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. భారత్ లో రిక‌వ‌రీ రేటు 97.31 శాతంగా ఉంది.

తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 1,13,069 కరోనా పరీక్షలు నిర్వహించగా, 715 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 76 కొత్త కేసులు నమోదయ్యాయి. నారాయణపేట జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 784 మంది కరోనా నుంచి కోలుకోగా.. నలుగురు మరణించారు. తాజా మరణాలతో కలిపి 3,751 మంది కరోనాతో మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,35,320 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,21,541 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 10,028 మందికి చికిత్స జరుగుతోంది.

16-07-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. ఏపీలో గడచిన 24 గంటల్లో 81,740 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,345 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 508 కొత్త కేసులు నమోదు కాగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 29 కొత్త కేసులు గుర్తించారు. అదే సమయంలో 3,001 మంది కరోనా నుంచి కోలుకోగా, 16 మంది మృతి చెందారు. కరోనా మృతుల సంఖ్య 13,097కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటిదాకా 19,34,450 పాజిటివ్ కేసులు నమోదు కాగా 18,96,499 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 24,854 మంది చికిత్స పొందుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

4 × five =

Back to top button