భారతదేశంలో గత 24 గంటల్లో 2,539 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 4,491 మంది కరోనా నుంచి కోలుకోగా… 60 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 30,799 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 0.35 శాతంగా ఉంది. రికవరీ రేటు 98.73 శాతానికి పెరిగింది. ఇప్పటి వరకు మన దేశంలో 4,24,54,546 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మృతుల సంఖ్య 5,16,132కి పెరిగింది. ఇప్పటి వరకు 180.80 కోట్ల డోసుల వ్యాక్సిన్ వేశారు. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో 69 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో అత్యధికంగా 26 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 82 మంది కరోనా నుంచి కోలుకోగా ఒక్క మరణం కూడా సంభవించలేదు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 23,19,012కి చేరుకుంది. 23,03,772 మంది కరోనా నుంచి కోలుకోగా… మొత్తం 14,730 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 510 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 75 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 82 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదు. హైదరాబాద్ లో అత్యధికంగా 34 మంది కరోనాకు గురయ్యారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 7,90,574కి పెరిగింది. కరోనా నుంచి ఇప్పటివరకు 7,85,647 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 4,111 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 816 యాక్టివ్ కేసులు ఉన్నాయి.