భారతదేశంలో గత 24 గంటల్లో 30,757 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది. అదే సమయంలో 541 మరణాలు సంభవించాయి. కరోనా నుంచి అదే సమయంలో 67,538 మంది కోలుకున్నారు. దేశంలో ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 3,32,918గా ఉంది. భారతదేశంలో ఇప్పటి వరకు కరోనా నుంచి మొత్తం 4,19,10,984 మంది కోలుకున్నారు. దేశంలో మొత్తం 174,24,36,288 డోసుల కరోనా వ్యాక్సిన్లు వేశారని వివరించింది.
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 512 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 125 కేసులు నిర్ధారణ అయ్యాయి. అదే సమయంలో ఒక వ్యక్తి మృతి చెందారు. గత 24 గంటల్లో 1,217 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 7,85,143కి చేరుకున్నాయి. ఇప్పటి వరకు 7,73,362 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 4,100 మంది మృతి చెందారు. రాష్ట్రంలో 7,673 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఏపీలో గత 24 గంటల్లో 675 కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 143 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో ముగ్గురు మరణించారు. మొత్తం 2,414 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 23,14,502కి పెరిగింది. వీరిలో 22,88,989 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 14,705 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10,808 యాక్టివ్ కేసులు ఉన్నాయి.