దేశంలో కరోనా కేసుల అప్డేట్స్

0
697

భారతదేశంలో గత 24 గంటల్లో 2,58,089 కొవిడ్ కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 385 మంది మ‌ర‌ణించారు. అదే సమయంలో క‌రోనా నుంచి 1,51,740 మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 16,56,341 మందికి చికిత్స అందుతోంది. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య‌ 8,209కి పెరిగింది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 70.37 కోట్ల క‌రోనా ప‌రీక్ష‌లు చేశారు.

ఏపీలో గడచిన 24 గంటల వ్యవధిలో 30,022 శాంపిల్స్ పరీక్షించగా 4,570 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1,124 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 669 మంది కరోనా నుంచి కోలుకోగా, చిత్తూరు జిల్లాలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 21,06,280 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 20,65,000 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 26,770 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,510కి పెరిగింది.

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 55,883 మందికి కరోనా పరీక్షలు చేయగా 2,047 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,174 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 2,013 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,09,209 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,83,104 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 22,048 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,057కి పెరిగింది.