More

    దేశంలో కరోనా కేసుల అప్డేట్స్.. భారీగా తగ్గాయి..!

    భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గత 24 గంటల్లో 11,07,617 మందికి కరోనా పరీక్షలను నిర్వహించగా 8,865 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. 287 రోజుల్లో ఇంత తక్కువ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. గత 24 గంటల్లో 11,971 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో కేవలం 197 మరణాలు మాత్రమే సంభవించాయి. ఇప్పటి వరకు కరోనా వల్ల మన దేశంలో మృతి చెందిన వారి సంఖ్య 4,63,852కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 1,30,793 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 98.27 శాతానికి చేరుకుంది. భారత్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతోంది. భారతదేశంలో ఇప్పటి వరకు వేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,12,97,84,045కి చేరుకుంది. కేరళలో గత 24 గంటల్లో 4,547 కరోనా కేసులు నమోదుకాగా… 57 మంది ప్రాణాలు కోల్పోయారు.

    తెలంగాణలో గడచిన 24 గంటల్లో 34,778 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 148 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 50 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 151 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,73,722 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 6,66,012 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,735 మందికి చికిత్స జరుగుతోంది. కరోనా మృతుల సంఖ్య 3,975కి పెరిగింది.

    ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో 21,360 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 117 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 24 కొత్త కేసులు నమోదు కాగా, విజయనగరం, కర్నూలు జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. ఇక అదే సమయంలో 241 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,70,095 పాజిటివ్ కేసులు నమోదు కాగా 20,52,718 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 2,961 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,416కి పెరిగింది.

    Trending Stories

    Related Stories